కరోనాకి వర్మ వింత ప్రశ్న


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేరుగా కరోనా వైరస్ కే ఓ ప్రశ్నవేశాడు. ఇప్పుడు ఏం చేయాలి కరోనా ? అంటూ ప్రశ్నించాడు. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మన దేశంలోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

సామాన్యుడు, సెలబ్రేటీ అనే తేడానే లేదు. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో ఏమీ తోచడం లేదంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టయిల్ లో ట్విట్ చేశారు. ‘నెలకు 30 రోజులు ఉంటాయని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ వెయ్యి రోజులు ఉంటాయని మొదటిసారి అనిపిస్తోంది. సమయం ముందుకు సాగడం లేదు. కరోనా భయంతో సమయంతో సహా అన్నింటిని ఆపేశారు. ఇప్పుడు ఏమి చేయాలి కరోనా’ అంటూ రాసుకొచ్చారు వర్మ.