కరోనాకి సింగరేణి సాయం రూ. 7.8కోట్లు

కరోనా కట్టడి కోసం తమవంతుగా ఆర్థిక సాయం చేసేందుకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ముందుకొస్తున్నారు. పలు సంస్థలు కూడా కరోనా సాయం చేస్తున్నాయి. తాజాగా కరోనా కట్టడి కోసం సింగరేణి కార్మికులు రూ. 7.8కోట్ల విరాళం ప్రకటించారు. సీఎం సహాయనిధికి రూ.7.80 కోట్లను వితరణగా సింగరేణి కార్మికులు అందజేయనున్నట్టు టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు తెలిపారు. వేతనం నుంచి ఒక్కరోజు డీఏను కార్మికులు వితరణగా ఇవ్వనున్నట్టు తెలిపారు.

 ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సన్‌ఫార్మా కూడా కరోనా సాయం చేసింది. రూ.25 కోట్ల విలువ చేసే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌(హెచ్‌సీక్యూఎస్‌), అజిత్రోమైసిన్‌ సహా ఇతర మందులు, శానిటైజర్లను విరాళంగా అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.