సొంత గ్రామానికి సుకుమార్ సాయం
కరోనా కట్టడి కోసం సినీ తారలు తమవంతు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్రానికి సాయం ప్రకటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా తనవంతు సాయంగా రూ. 10లక్షల సాయం ప్రకటించారు. ఒక్కో తెలుగు రాష్ట్రానికి రూ. 5లక్షల చొప్పున విరాళం ఇస్తానని తెలిపారు. తాజాగా ఆయన సొంతూరికి రూ. 5లక్షల సాయ ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు సుకుమార్ సొంతూరు. ఈ గ్రామ అభివృద్ధికి సుకుమార్ తనవంతు సాయంగా రూ. 5లక్షలు ప్రకటించారు. తనలాంటి వారు మరెందరో సహాయం చేయడానికి ముందుకు రావాలని సుకుమార్ పిలుపునిచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రంగస్థలం తర్వాత సుకుమార్ నుంచి మరో సినిమా రాలేదు. ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా కరోనా ప్రభావం తగ్గాక రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.