గొడుగుతో కరోనా కట్టడి
కరోనా కట్టడికి గొడుగు బాగా ఉపయోగపడుతుందని విశాఖకు చెందిన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తెలిపారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సామాజిక దూరానికి అనువైన సిద్ధాంతమని తెలిపారు. సామాజికదూరంలో భాగంగా 3 అడుగుల దూరాన్ని కచ్చితంగా పాటించాలి. ప్రతీ ఒక్కరు గొడుగు వాడితే కచ్చితంగా ఒకరినుంచి మరొకరు కనీసం మీటరు దూరం పాటించొచ్చని వివరించారు.
అంతేకాదు.. గొడుగువాడటం వలన ఎదుటివారు తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లను గొడుగు అడ్డుకుంటుందన్నారు. బయటినుంచి ఇంటికి రాగానే.. ఆ గొడుగును అరగంట ఎండలో ఉంచి, శానిటైజర్ తో శుభ్రపరవచ్చు. రైతుబజార్లలో, దుకాణాలకి వెళ్లే ప్రజలకి గొడుగు రక్షణ కవచంగా ఉంటుందని తెలిపారు. మరెందుకు ఆలస్యం మన ఇంట్లో గొడుగుని బయటికి తీయండి. వాడేయండీ.