ప్రజలు మారడం లేదంటూ.. వడివేలు ఏడ్చేశాడు !
కరోనా కట్టడి కోసం సినీ తారలు తమవంతు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీడియోలు విడుదల చేస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా కరోనా కట్టడి కోసం తమవంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం, సినీ తారలు కరోనా గురించి ఎన్ని జాగ్రత్తలు చెప్పిన కొందరు పెడ చెవినపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హాస్య నటుడు వడివేలు తాజాగా అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఎప్పుడూ నవ్వించే ఆయన కన్నీళ్లతో సందేశమివ్వడం కలచివేస్తోంది.
‘చాలా మనోవేదనకు గురవుతున్నా. ప్రభుత్వం చెప్పే మాటలను అర్థం చేసుకోండి. వారి ఉత్తర్వుల మేరకు అందరూ కొన్ని రోజులపాటు ఇళ్లలోనే ఉండండి. వైద్య ప్రపంచమే భయాందోళనకు గురవుతోంది. వైద్యులు, నర్సులు ప్రాణాలను పనంగా పెట్టి సేవలందిస్తున్నారు. దయచేసి అందరూ సహకరించండి. ఎవరూ బయటకు రాకండి. పోలీసులు కూడా మిమ్మల్ని బతిమలాడటాన్ని చూస్తున్నా. బిడ్డాపాపలతో హాయిగా ఇంట్లోనే ఉందాం. ఎవరూ తేలికగా తీసుకోకండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
நம்ம சந்ததிகளுக்காக, நம்ம வம்சாவழிக்காக எல்லோரும் வீட்டுலயே இருங்க 🙏 pic.twitter.com/I6wMMyl57W
— Actor Vadivelu (@VadiveluOffl) March 26, 2020