ఒక్కడు 59వేల మంది కరోనా అంటించాడట
కరోనా వైరస్ కి మందు లేదు. ముందు జాగ్రత్త ఒక్కటే శరణ్యం. ముందు జాగ్రత్తలు పాటించని దేశాల పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మృతి చెందారు. అందుకే కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు. కరోనా పాజిటివ్ కేసులు రికవరి అవుతున్నారు. ఇప్పటికే 11 మందికి నెగటివ్ వచ్చింది. దాంతో వారిని ఇంటికి పంపించనున్నాం. ఇలాగే ప్రతిరోజూ.. కొందరికి నెగటివ్ వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగని.. నిర్లక్ష్యం వద్దు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దక్షిణ కొరియాలో ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతడు ఒక్కడి నుంచి 59000 మందికి కరోనా పాకింది. కరోనా అంత డేంజర్. చిన్న సూదిపై లక్షల్లో కరోనా వైరస్ లు ఉంటాయి. అంత పవర్ ఫుల్. ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే ముందు జాగ్రత్త ఒక్కటే శరణ్యం. దేశ ప్రధానులు, మంత్రులు కూడా కరోనా బారినపడుతున్నారు. అందుకే నిర్లక్ష్యం వద్దు. జాగ్రత్తగా ఉండాలి సీఎం కేసీఆర్ కోరారు.