బ్రేకింగ్ : కరోనా భయంతో జర్మనీ ఆర్థికమంత్రి ఆత్మహత్య
ప్రపంచ దేశాలని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశ ప్రధానులు, మంత్రులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ వల్ల భవిష్యత్‌లో సంభవించబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలోనన్న తీవ్ర ఆందోళనతో జర్మనీలోనీ హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ వోల్కర్ బౌఫియర్ వెల్లడించారు.
“మేం షాక్‌లో ఉన్నాం. దీన్ని నమ్మలేకపోతున్నాం. మాకు ఎంతో బాధగా ఉంది. హెస్సీ ఆర్థిక మంత్రిగా థామస్ 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మహమ్మారి ధాటికి ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి.. కంపెనీలు, కార్మికులకు అండగా నిలవడానికి ఆయన పగలూ రాత్రి తీవ్రంగా శ్రమించారు. ఈ కష్ట సమయంలో ఆయన మాకు ఎంతో అవసరం” అని వోల్కర్ అన్నారు.