ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకి భరోసా ఇచ్చారు. పండిన ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. రైతులకు టోకెన్లు జారీ చేసి విడతల వారీగా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులంతా క్రమశిక్షణతో ప్రభుత్వానికి సహకరించాలి. ఒకేరోజు అందరి ధాన్యం కొనుగోలు సాధ్యం కాదు. అందువల్ల టోకెన్‌పై ఉన్న తేదీ ప్రకారమే రైతులు ధాన్యం అమ్మకానికి రావాలని సీఎం కేసీఆర్ కోరారు.
వరి, మొక్కజొన్నలని కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. వరి..కోటి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు.