భారత్ తెలివిగల పని
కరోనా కట్టడి విషయంలో భారతదేశం చాలా తెలివిగా వ్యవహరించిందని ఇంటర్నేషనల్ మెడికల్ జర్నలిజం ప్రశంసిస్తోంది. ఈ విషయాన్నిస్వయంగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదివారం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
కరోనా వ్యాధిని నివారించడం పట్ల 130 కోట్ల జనాభా ఉన్న భారత్ తెలివిగా వ్యవహరించిందని అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అందరూ సహకరిస్తున్నారని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు. గండం నుంచి గట్టెక్కినట్లేని ఇప్పుడే సంబరపడవద్దని సీఎం హితవు పలికారు. ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని, అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.