రహానె కరోనా విరాళం రూ.10 లక్షలు
కరోనా కట్టడి కోసం సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌పై పోరాటానికి టీమ్ఇండియా క్రికెటర్లు తమ వంతు సాయం చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి టీమ్ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె రూ.10 లక్షలు విరాళం ప్రకటించాడు.
మరోవైపు భారత మహిళల జట్టులో 16 ఏళ్ల యువ క్రికెటర్ రిచా ఘోశ్ రూ.లక్ష ఇచ్చింది. ఈ మొత్తాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు తెలిపింది. కరోనాపై పోరుకు రైనా రూ.51 లక్షలు, సచిన్ రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.