త్రిషకు కంపెనీ ఇచ్చిన రానా, బన్నీ
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. సినిమా షూటింగ్‌లు కూడా ఆగిపోవడంతో సినీ ప్రముఖులు సైతం ఇంటికే పరిమితమయ్యారు. తమకి నచ్చిన పని చేసుకొంటూ కుటుంబంతో గడుపుతున్నారు. అయితే ఇంట్లో ఖాళీగా ఉంటోన్న త్రిషకి రానా, బన్నీ కంపెనీ ఇచ్చారట.
ఈ విషయాన్ని తెలుపుతూ త్రిష ట్విట్ చేసింది. తనకు రానా, బన్నీ కంపెనీ ఇచ్చారని త్రిష ఓ పోస్ట్ చేశారు. వీడియో కాల్‌లో ముచ్చట్లు చెప్పుకున్నామని తెలుపుతూ స్క్రీన్ షాట్‌ను ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తోనూ త్రిష వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.