రచయిత చేతిలో హీరోయిన్ మోసపోలేదట 

బాలీవుడ్ లో రచయిత హిమాన్షు శర్మ-హీరోయిన్ స్వరా భాస్కర్ డేటింగ్ స్టోరీ గురించి తెలిసిందే. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ‘రాంఝానా’ అనే బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలోపడిన వీరిద్దరూ కొన్నేళ్లు డేటింగ్ లో ఉన్నారు. గతేడాది ఆగస్టులో విడిపోతున్నట్లు ప్రకటించారు.

తాజాగా ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వరాభాస్కర్‌ హిమాన్షుతో బ్రేకప్‌ గురించి స్పందించారు. మా బ్రేకప్‌లో ఎవరి తప్పు లేదు. అలాగే మేము మోసం చేసుకోలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందన్నారు. ఆ పరిస్థితులు ఏంటన్నది మాత్రం చెప్పలేదు. అయితే మన ఇష్టాలను మాత్రమే కాకుండా పక్కనవారి ఇష్టాలను కూడా గౌరవించినప్పుడే ఓ ఉన్నతమైన మనిషిగా మనం పరిణతి చెందిన వాళ్లమవుతామని స్టేట్ మెంట్ ఇచ్చింది.