సినీ కార్మికులకి బన్నీ సాయం రూ. 20లక్షలు

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన సినీ కార్మికులని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సి.సి.సి మీకోసం’ సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి సినీ ప్రముఖుల నుంచి విరాళాలు వెలువెత్తుతున్నాయి. తాజాగా స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సినీ కార్మికుల కోసం రూ. 20లక్షల విరాళం ప్రకటించారు.

ఇప్పటి వరకు బన్నీ కరోనా సాయంగా రూ. 1.45కోట్లు చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రానికి బన్నీ కరోనా సాయం చేసిన సంగతి తెలిసిందే. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి బన్నీ రూ. 25లక్షల విరాళం ఇచ్చారు. ఇక సి.సి.సి కి ఈరోజు ప్రభాస్ రూ. 50లక్షలు, యూవీ క్రియేషన్స్ 10లక్షల విరాళం ప్రకటించాయి.