గుడ్ న్యూస్ : ఇండోనేషియా బృందం సహాయకులకి నెగటివ్
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఫలితానిస్తున్నాయ్. కరోనా పాజిటివ్ కేసుల్లో 11మందికి నెగటివ్ అని తేలిందని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఏప్రిల్ 7 తర్వాత కరోనా ఫ్రీ తెలంగాణ కానుందనే తీపి కబురు చెప్పారు.
మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ? ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియాకు చెందిన పది మంది మత ప్రచారకుల బృందానికి సాయం చేసిన ఇద్దరికి కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా వైద్యాధికారులు ప్రకటన చేశారు. ఈనెల 16న కరోనా లక్షణాలున్న ఇండోనేషియా బృందాన్ని కరీంనగర్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇండోనేషియా బృందాన్ని కలిసిన వారందరిని గుర్తించి.. వారికి పరీక్షలు నిర్వహించారు.