జాన్వీతో తారక్ రొమాన్స్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేయాలని టాలీవుడ్ స్టార్ హీరోలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. టాలీవుడ్ సంచలనం విజయ దేవరకొండ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుందనే ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు.
ఇంతలో జాన్వీతో రొమాన్స్ చేసేందుకు తారక్ రెడీ అయినట్టు సమాచారమ్. త్రివిక్రమ్-తారక్ కాంబోలో రెండో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాని మొదలెట్టనున్నాడు. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ని ఓ హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు సమాచారమ్. మరో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారమ్.