వారిపై కేసీఆర్ శాపనార్థాలు

కఠిన సమయాన తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఫలితంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నెగటివ్ గా తేలుతున్నాయి. అతి త్వరలోనే కరోనా ఫ్రీ తెలంగాణని చూడబోతున్నామని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు.

అదేసమయంలో కఠిన సమయాన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారికి  కరోనా రానీ అంటూ శాపనార్థాలు పెట్టారు. అంతేకాదు.. రేషన్ లో ఇచ్చే వాటిని బ్లాక్ మార్కెట్ వచ్చే వారికి కూడా కరోనా రానీ అంటూ సీఎం కేసీఆర్ శాపనార్థాలు పెట్టారు.