ఎన్టీఆర్ మాటల్లో నిప్పు కనికలు ఎగసి పడుతున్నాయ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ చెబితే ఎట్టుట్టదో అందరికీ తెలిసిందే. అయితే తారక్ తమిళ్ లోనూ అద్భుతంగా డైలాగ్స్ చెప్పడం ఆకట్టుకుంటోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా వదిలిన టీజర్ లో తారక్ మాటలు హైలైట్ గా నిలిచాయ్.
‘ఎన్ అన్నన్.. కాటుక్కు మన్నన్.. అల్లూరి సీతారామరాజు’ అంటూ తమిళంలో ఎన్టీఆర్ చెబుతున్న మాటలు తమిళ జనాలను ఆకట్టుకుంటున్నాయి. తమిళంలో డైలాగులు చెబుతున్నప్పుడు ఎన్టీఆర్ మాటల్లో నిప్పు కనికలు ఎగసి పడుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమిళ్ లో రాజమౌళి ఆస్థాన రచయిత మదన్‌కార్కి తారక్ డైలాగ్ లకి ఫిదా అవుతూ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.