సినీ కార్మికులకు ప్రభాస్ రూ.50లక్షల సాయం

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించడం వలన సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. దీంతో సినీ కార్మికులకి పనిలేకుండా పోయింది. ఈ కఠిన సమయాన వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సి.సి.సి మీ కోసం సంస్థని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి సినీ ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సి.సి.సి కోసం రూ.50 ల‌క్ష‌ల విరాళాన్ని ప్రకటించారు.

ఇప్పటికే ప్రభాస్ కరోనా సాయంగా రూ. 4కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ. 3కోట్లు ప్రధాన మంత్రి సహాయనిధికి అందించారు. ఒక్కో తెలుగు రాష్ట్రానికి రూ. 50లక్షల చొప్పున అందించారు. ఇప్పుడు సినీ కార్మికులని ఆదుకునేందుకు ప్రభాస్ గొప్పమనసు చూపాడు. పెద్ద మొత్తంగా విరాళం ఇచ్చాడు.

ప్రస్తుతం రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా తెరకెక్కుతోంది. యూరప్ నేపథ్యంలో సాగే ప్రేమకథ చిత్రమిది. పునర్జ్మనల నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండనుంది.