కరోనా టెస్ట్ కోసం కాదు.. ప్రెగ్నెసీ టెస్ట్ కోసం వెళ్లా !
హీరోయిన్ రాధిక ఆప్టేకు కరోనా సోకిందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో హాస్పటల్ ఉన్న ఫోటోని షేర్ చేయడమే ఇందుకు కారణం. అయితే తనకి కరోనా సోకలేదని రాధిక స్పష్టం చేసింది. కానీ హాస్పటల్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయం క్లారిటీ ఇవ్వలేదు.
తాజాగా హాస్పటల్ కి వెళ్లడానికి గల కారణాన్ని రాధిక బయటపెట్టింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసమే హాస్పటల్ కి వెళ్లానని క్లారిటీ ఇచ్చింది. నా సన్నిహితురాలికి ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఆస్పత్రికి వెళ్లా. తనకు తోడుగా మాత్రమే ఉన్నానని వివరణ ఇచ్చింది. అయితే ఆమె ఫ్రెండ్ ఫోటో షేర్ చేయకపోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.