‘సామజవరగమన’ కరోనా పేరడి.. నవ్వు ఆపుకోలేరు !

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అల.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. ఇక అల.. పాటలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయ్ అన్న సంగతి తెలిసిందే. ‘సామజవరమన’ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడీ సాంగ్ ని కరోనాకి పేరడి కట్టారు. అది చదివితే నవ్వు ఆపుకోలేరూ.. !!

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..

వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..

వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!

నీ ముక్కును పట్టుకు వదలనన్నది చూడే ఆ వైరస్

నీ తుమ్ములనలా వదిలిపెట్టకు దయలేదా ఓ మిస్

తుమ్ముల కాలమా, తుంపరలాపుమా

ప్రతి మనిషిలోన దాగి ఉన్న కరోనా కణమా,

పడిశెపు దెయ్యమా, పాకుట ఆపుమా

పని పాటలాపి మేము ఇలా పడుకుంటామా?

అరె, నీగాలే తగిలితే, దేశాలే బెదిరితే,  స్టాకులే, బాకులై, చంపే,

నీ పేరే తలచితే, ఏరోప్లేన్లాగితే, షాపులో సరుకులే మాకిక లేవే,

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..

వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!  

సామజవరగమనా, నేనిల్లు దాట గలనా..

వయసు మీద వైరస్ కున్న అదుపు చెప్పగలనా..!!  

నీ ముక్కును పట్టుకు వదలనన్నది చూడే ఆ వైరస్

నీ తుమ్ములనలా వదిలిపెట్టకు దయలేదా ఓ మిస్

నీ ఇంటికి కావలి కాస్తుందే, ముప్పొద్దులా ఆ అంబులెన్స్

నీ వాట్సాప్ లో లవ్ ఎమొజీనే పెడతానే ప్రామిస్..