రంగస్థల నటిగా అనసూయ


హాట్ యాంకర్ అనసూయ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సోగ్గాడే చిన్నినాయన, క్షణం, రంగస్థలం సినిమాల్లో ఆమె నటనకి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆచార్య, వకీల్ సాబ్, రంగమార్తాండ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ సినిమాలో అనసూయకి కీలక పాత్ర దక్కినట్టు సమాచారమ్.

ఇక కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో అనసూయ రంగస్థల నటిగా కనిపించనుందట. ఆమె పాత్రని ఊరూరా తిరుగుతూ నాటకాలు ప్రదర్శించే ఓ కళాకారిణిగా కనిపిస్తుందట.  ఆమె లుక్ కొత్తగా, గ్లామరస్ గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు