హీరోయిన్స్ ఎందుకు సాయం చేయరు.. బ్రహ్మాజీ ఫైర్ !
కరోనా కట్టడి కోసం తమవంతు సాయంగా సినీ తారలు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి కరోనా సాయం అందిస్తున్నారు. దీంతో పాటు టాలీవుడ్ సినీ కార్మికుల కోసం ఏర్పాటైన సి.సి.సి మీ కోసం సంస్థకి భారీగా విరాళాలు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని సప్తగిరి, సంపూర్నేష్ బాబు వరకు తమవంతు సాయంగా సినీ కార్మికుల కోసం విరాళాలు ప్రకటించారు.
అయితే హీరోయిన్స్ మాత్రం పైసా తీయడం లేదు. తమవంతు కరోనా సాయం అంటూ ప్రకటించడం లేదు. స్టార్ హీరోయిన్స్ కాజల్, పూజా హెగ్డే, తమన్నా, రకుల్ మొదలుకొని యంగ్ హీరోయిన్స్ రష్మిక, మెహ్రీన్.. ఎవరూ కూడా సినీ కార్మికులని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. ఒక్క లావణ్య త్రిపాఠి మాత్రం సినీ కార్మికుల కోసం సాయం చేసింది.
హీరోయిన్స్ కరోనా సాయం ప్రకటిందకపోవడంపై ఇండస్ట్రీ ప్రముఖులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై నటుడు బ్రహ్మాజీ నిలదీశాడు. ముంబై నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు ఇక్కడ పని చేస్తున్నారని… అయితే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీ కోసం ఎవరూ స్పందించడం లేదని బ్రహ్మాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు.