తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఏప్రిల్ 7కల్లా కరోనా ఫ్రీ తెలంగాణ చూస్తామని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దానికి ఢిల్లీ సమావేశం గండికొట్టింది. ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న పలువురికి కరోనా పాజిటివ్ అని తేలుస్తోంది. సోమవారం ఒక్కరోజే తెలంగాణలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు, వారి కుటుంబ సభ్యులు కావడం విశేషం. దీంతో కరోనా బాధితుల సంఖ్య 97కి చేరింది. మరో 6గురు మృతి చెందారు.
ఇక ఇప్పటి వరకు 14 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 77 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక తమిళనాడులో మంగళవారం ఒక్క రోజే 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 50 మంది నిజాముద్దీన్ మర్కజ్ లో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారేనని తేలింది. మొత్తంగా తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 124కు చేరింది.