డేంజర్ లో కనికా కపూర్


బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ డేంజర్ లో పడింది. ఆమెకి కరోనా అస్సలు తగ్గడం లేదు. ఒకటి కాదు.. రెండు సార్లు ఏకంగా ఐదుసార్లు చేసిన కరోనా నిర్థార్ణ పరీక్షల్లో ఆమెకి పాజిటివ్ గా తేలింది. దీంతో కరోనా నుంచి కనికా కోలుకోవడం కష్టమేనేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవల లండన్ వెళ్లొచ్చిన కనికా.. ఆ విషయాన్ని దాచిపెట్టేసి లక్నోలోని ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీకి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాని రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె తనయుడు ఎంపీ దుష్యంత్ హాజరుకావడం.. ఆ తర్వాత దుష్యంత్ పార్లమెంట్ సమావేశాలకి హాజరవ్వడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. వారికి కరోనా నెగటివ్ అని తేలాక బయటికొచ్చారు. అయితే కనికా కపూర్ కి మాత్రం ఎన్నిసార్లు కరోనా నిర్థారణ పరీక్షలు చేసిన పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది.