లాక్ డౌన్ పై చంద్రబాబు అసంతృప్తి

కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే లాక్ డౌన్ సరిగ్గా అమలు అవ్వడం లేదంటూ ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో లాక్ డౌన్ తో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. కానీ చివరికి లాక్ డౌన్ సక్రమంగా అమలు కావడం లేదన్నారు.

ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తుంది. లాక్ డౌన్ పై ప్రజలలో అవగాహనా కల్పించి మాత్రమే వైరస్ ను కట్టడి చేయగలమని బాబు అన్నారు. మన రాష్ట్రంలో బెడ్లు కూడా తక్కువగా ఉన్నాయని.. అనుకోని ప్రమాదం వస్తే కంట్రోల్ చేసేదెలా అని ప్రశ్నించారు. పరిస్థితితులు సాధారణ స్థితికి వచ్చేవరకు సామజిక దూరం పాటించాల్సిందేనన్నారు. ఇక కరోనా సాయంగా చంద్రబాబు రూ.10లక్షల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.