ప్రభాస్ సినిమాపై కరోనా ఎఫెక్ట్ లేదు

కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినీ తారలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. తమకి నచ్చిన పనులు చేసుకుంటూ ఇంటిపట్టున గడుపుతున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులని సంతోషపెడుతున్నారు.

టాలీవుడ్ లో కరోనా ప్రభావం పెద్దగా పడని హీరో ఎవరు ? అంటే.. ప్రభాస్ అనే చెప్పాలి. కరోనా విజృంభిస్తున్న సమయంలోనే జార్జియా వెళ్లొచ్చింది ప్రభాస్ టీం. రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా షెడ్యూల్ అక్కడ జరుపుకొంది. ఇక్కడి వచ్చాక కూడా ఖాళీగా ఉండటం లేదు.

ఈ ఖాళీ సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం చిత్రయూనిట్ వాడుకుంటోంది. షూటింగ్ జరిగిన భాగానికి సంబంధించిన  పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రస్తుతం నిర్వహిస్తున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఇక, ప్రభాస్ కరోన సాయంగా రూ.4.2కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.