రస్మిక బాగా పెంచేసింది
హీరోయిన్ రష్మిక మందనకి సంబంధించి రెండు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రస్మికకి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో రొమాన్స్ చేసింది. సుకుమార్-అల్లు అర్జున్ సినిమాలో రస్మికనే హీరోయిన్. త్రివిక్రమ్-తారక్ సినిమా కోసం రస్మికని తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై స్టార్ హీరోలతో సినిమాలని చేయాలని రస్మిక నిర్ణయించుకుందట.
ఈ మేరకు ఆమె మేనేజర్ కి ఆదేశాలు కూడా జారీ చేసిందట. స్టార్ డమ్ లేని హీరోలకి సంబంధించిన ప్రాజెక్టులను ఒప్పుకోవద్దని తన మేనేజర్ తో చెప్పిందట. అంతేకాదు.. మీడియం హీరోల సినిమాలు, ఇతర ప్రాజెక్టుల కోసం తనని సంప్రదించిన వారికి భారీ పారితోషికం.. అంటే అసలు భరించలేనంత రేటు చెప్పి భయపెడుతుందట.