ప్రధాని వీడియో మెసేజ్’లో ఏం చెప్పబోతున్నారు
కరోనా కట్టడి కోసం కేంద్రం తీసుకొంటున్న చర్యలని ప్రశంసించాల్సిందే. ఎందుకంటే ? అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనాని కట్టడి చేయలేకపోయింది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపుతో లాక్ డౌన్ ప్రకటించేశారు. కరోనాని కట్టడి చేయడంలో కొత్త మేర సఫలం అవుతున్నారు. ఇక కరోనా నివారణపై మోదీ జాతినుద్దేశించి రెండు సార్లు ప్రసంగించిన సంగతి తెలిసిందే.
ఇక గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగంలో.. లాక్ డౌన్ ఫలితంగా చిక్కుబడిపోయిన ప్రజలను లాక్ డౌన్ ముగిశాక వారి వారి స్వస్థలాలకు సురక్షితంగా పంపే మార్గాలపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని మోదీ సూచించారు. అంతేకాదు.. శుక్రవారం ఉదయం 9 గంటలకు తాను వీడియో మెసేజ్ ని షేర్ చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. ‘నా తోటి కార్మికులకు ఓ చిన్న వీడియో మెసేజ్ ని పోస్ట్ చేస్తున్నా’ అని ఆయన హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు. మరీ వీడియో మెసేజ్ లో ప్రధాని ఏం చెబుతారు అన్నది చూడాలి.