రోహిత్ శర్మ మాటల్లో దేశభక్తి
లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ తాజాగా సోషల్‌మీడియాలో పలువురు క్రికెటర్లతో లైవ్‌చాట్ చేస్తున్నాడు. బుధవారం బుమ్రాతో హిందీలో మాట్లాడుతుండగా కొందరు అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్.. అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని చెబుతున్నారని, తాము భారతీయులం అయినందున హిందీలోనే మాట్లాడతామని స్పష్టంచేశాడు.
టీవీ ఇంటర్వ్యూల్లో తాను ఇంగ్లీష్‌లోనే మాట్లతానని, ప్రస్తుతం ఇంట్లో ఉన్నందున హిందీలో మాట్లాడుతున్నట్లు హిట్‌మ్యాన్ ఘాటుగా స్పందించాడు. ఇక కరోనా జాగ్రత్తలు చెప్పిన హిట్ మ్యాన్.. ప్రతి ఒక్క పౌరుడిని ఇంట్లోనే ఉండి, తరచూ చేతులు కడుక్కోవాలని సూచించాడు. ఇక దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 1834 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 41 మంది మృతిచెందారు.