టీఆర్పీ రేటింగ్స్ లోనూ సరిలేరు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమా బుల్లితెరపై కూడా రికార్డ్ సృష్టించింది.
ఇటీవలే సరిలేరు నీకెవ్వరు బుల్లితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. టీవీల్లో సరిలేరుని రికార్డు స్థాయిలో వీక్షించారు. ఏకంగా 23.4 టీఆర్పీ రేటింగ్స్ నమోదు చేసింది. అసలే కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమైన జనాలు సరిలేరు నీకెవ్వరుని చూసేసినట్టున్నారు. దీంతో బుల్లితెరపై సరిలేరు సరికొత్త రికార్దులని సృష్టించింది.
ఇక మహేష్ బాబు తదుపరి సినిమా వంశీపైడి పల్లి దర్శకత్వంలో ఉండాల్సి ఉన్నా.. అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.