అదే మనకు శ్రీరామ రక్ష : తారక్
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పండగని పండగలా జరుపుకోలే పరిస్థితి. తెలుగు సంవత్సరాధి ఉగాధిపై కరోనా ఎఫెక్ట్ కనిపించింది. అప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో ఎవరు కూడా బయటికిరాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఝప్తి మేరకు ఇంట్లో ఉండి.. టీవీల్లో పంచాంగం విన్నాం. ఇప్పుడు మన ఆరాధ్య దైవం శ్రీరాముడు లగ్నానికి వెళ్లలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ శ్రీరామ నవవి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఇంట్లోనే ఉండండని సూచించాడు. “మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇంటిపట్టునే ఉండండి. మీ ఆరోగ్యానికి అదే శ్రీరామ రక్ష” అని రాసుకొచ్చారు తారక్.
ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుంచి భీమ్ ఫర్ రామరాజు టీజర్ వచ్చిన సంగతి తెలిసిందే. తారక్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ కట్ చేశారు. ఎన్ టీఆర్ మాటల్లో నిప్పు కనికలు ఎగిసిపడ్దాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇంటిపట్టునే ఉండండి. మీ ఆరోగ్యానికి అదే శ్రీరామ రక్ష
— Jr NTR (@tarak9999) April 2, 2020