గుడ్ న్యూస్ : తెరచుకోనున్న థియేటర్స్.. కానీ !

కరోనా కట్టడి కోసం దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం షాపులు మూతపడటంతో మందుబాబులు తల్లడిల్లిపోతున్నారు. పిచ్చోళ్లు అవుతున్నారు. సినీ ప్రేమికులది దాదాపు ఇదే పరిస్థితి. లాక్ డౌన్ తో థియేటర్స్ మూతపడటంతో సినీ ప్రేమికులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కాకపోతే సినిమా ప్రేమికులని డిజిటల్ ఫార్మెట్ ఆదుకుంటోంది. ఇంటికే పరిమితమైన ఖాళీ సమయాన వెబ్ సిరీస్ చూసేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లాంట్ యాప్ లలో నచ్చిన సినిమాలని చూసేస్తున్నారు. కానీ కొత్త సినిమాలు రావడం లేదే అనే బెంగ కొందరిది. అలాంటి వారికి గుడ్ న్యూస్.

మే 1 నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం వుందని వినిపిస్తోంది. అయితే అలా తెరుచుకునే థియేటర్లకు చైనాలోప్రస్తుతం అమలు చేస్తున్న పద్దతి అమలు చేయబోతున్నట్టు సమాచారమ్. సీటింగ్ కెపాసిటీని పాతిక శాతానికి తగ్గిస్తారు.అంటే వెయ్యి మందికి థియేటర్లో సీట్లు వుంటే 250 టికెట్ లు మాత్రమే అమ్మడం. అంటే మనిషికి మనిషికి మధ్య మూడు సీట్లు ఖాళీ వుండేలా చూడడం అన్నమాట. ప్రస్తుతం చైనాలో ఈ విధంగానే నిబంధన పెట్టి, థియేటర్లకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. మన దగ్గర అదే ఫార్ములాని ఫాలో అయ్యే అవకాశాలు లేకపోలేవు.