ఈ సారి కనిక బతికిపోయింది

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఈ సారి బతికిపోయింది. ఐదోసారి నిర్వహించిన పరీక్షల్లో ఆమెకి కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అయితే మరో పరీక్ష నిర్వహించే వరకు ఆమె ఆసుపత్రిలోనే ఉండాలని లఖ్‌నవూలోని పీజీఐ వైద్యులు సూచించారు. తదుపరి వైద్య పరీక్షలో కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు.

ఇటీవల లండన్ వెళ్లొచ్చిన కనికా.. ఆ విషయాన్ని దాచిపెట్టి లక్నోలో ఓ పార్టీకి హాజరైంది. ఆ తర్వాత ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆమెతో కలిసి పార్టీలో పాల్గొన్నవారంతా ఉలిక్కిపడ్డారు. ఈ లిస్టులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె తనయుడు ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా ఉన్నారు. వీరు వెంటనే సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్లారు. కరోనా నెగటివ్ అని తేలాక బయటికొచ్చారు. అయితే కనికకి మాత్రం నాలుగు సార్లు పరీక్షలు చేసిన కరోనా పాజిటివ్ గా రావడం ఆందోళన కలిగించింది.

ఐదోసారి పరీక్షల్లో మాత్రం ఆమెకి కరోనా నెగటివ్ రిపోర్ట్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోసారి కూడా ఆమెకి నెగటివ్ అని తేలితే డిశ్చార్జ్ చేయనున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న సెలబ్రేటీగా కనిక పేరు ఎక్కనుంది.