కరోనా సాయంగా రకుల్ ఏం చేస్తున్నారంటే ?

హీరోయిన్స్ కూడా కరోనా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ నయనతార తనవంతు సాయంగా సినీ కార్మికుల కోసం రూ. 20లక్షల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ క్లిష్ట సమయంలో పేదవారికి తనవంతు సహాయం చేస్తున్నారు. ఢిల్లీ గుర్గావ్‌లోని తన ఇంటికి దగ్గరున్న మురికివాడలోని కుటుంబాలకు రోజుకు రెండు పూట్ల ఆహారం పంపిణీ చేస్తున్నారు.

“ప్రస్తుతం మురికివాడలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వారి పరిస్థితి ఎలా ఉందని మా నాన్న తెలుసుకున్నారు. రోజుకు రెండుసార్లు భోజనం పంపిణీ చేస్తున్నాం. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కూడా ఆహారం పంపిణీ చేస్తాం. ఇప్పటికైతే ఏప్రిల్‌ వరకు ఇలా చేయాలి అనుకుంటున్నా. ఆ తర్వాత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలి. మా ఇంటికి సమీపంలో ఆహారాన్ని వండి, వారికి పంపుతున్నాం. ఇలాంటి కష్ట సమయంలో ప్రతి ఒక్కరు తమవంతు సాయం చేయాలి” అన్నారు రకుల్.