తెలంగాణలో 365కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో కరోనా ప్రభావం, తీసుకుంటున్న చర్యలని వివరించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని సీఎం తెలిపారు. కరోనా కారణంగా 11 మంది మరణించారన్నారు. ప్రస్తుతం 308 మంది కరోనా బాధితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఇంత వరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45 అని తెలిపారు. మర్కజ్ నుంచి1089 మంది వచ్చారనీ, వారిలో 172 మందికి కరోనా వచ్చిందనీ, వారు మరో 93 మందికి అంటించారనీ వివరించారు. కరోనాను ఎదుర్కోవాలంటే లాక్ డౌన్ ఒక్కటే ఆయుధమన్నారు. ప్రపంచంలో 22 దేశాలు లాక్డౌన్ చేశాయన్నారు. లాక్ డౌన్ పెంచాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కరోనా కట్టడికి అదొక్కటే గత్యంతరమన్నారు.