బన్నీ బర్త్ డే స్పెషల్ వచ్చేసోంది 

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్/ట్రీట్ ఈరోజు వచ్చేస్తోంది. ఈ మేరకు మైత్రీ మూవీస్ అప్ డేట్ ఇచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో #AA20 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమా కరోనా ప్రభావంతో వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండనుంది. ఇందులో బన్నీ చిత్తూరు జిల్లావాసిగా లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఆయన ఊరమాస్ లుక్, చిత్తూరు యాసలో డైలాగ్స్ హైలైట్ గా ఉంటాయనే ప్రచారం జరిగింది. హీరోయిన్ రష్మిక మందన కూడా చిత్తూరు జిల్లా అమ్మాయిగా కనిపిస్తుందనే వార్తలు వినిపించాయి. ఈ సినిమా కోసం ముందుగా ‘శేషాచలం’ అనుకొన్నా. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘ఆ’ (ఆర్య, ఆర్య2) సెంటిమెంట్ రెండక్షరాల టైటిల్ ని పెట్టాలని ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరిగింది.

ఇంతలో బన్నీ బర్త్ డే (ఏప్రిల్ 8) వచ్చేసింది. బర్త్ డే ట్రీట్ గా బన్నీ లుక్ ని రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ టైమ్ దగ్గరపడినా చిత్రబృందం నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా బన్నీ బర్త్ డే గిఫ్ట్ గురించి గట్టిగా అడిగేశారు. అసలే కరోనా క్వారంటైన్ లో ఉన్నాం. ట్రీట్ కావాల్సిందేనని డిమాండ్ చేశారు. చిత్రబృందం ఓకే చెప్పెసింది. రేపో, మాపో కాదు.. ఇప్పుడే ట్రీట్ అంటూ చెప్పేసింది. ఏ క్షణంలోనైనా బన్నీ బర్త్ డే ట్రీట్ రావొచ్చు.