లాక్ డౌన్ పొడిగించాలని కోరిన కేసీఆర్
కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారా ? కొనసాగిస్తారా ?? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడీ ఈ ఉత్కంఠకి తెరదించే ప్రయత్నం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగిస్తేనే మంచిదని.. లేకపోతే న్యూయార్క్ మాదిరిగా మన దగ్గర శవాల గుట్టలని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే చెప్పాను. లాక్ డౌన్ కొనసాగిస్తేనే మంచిదని చెప్పానని సీఎం కేసీఆర్ చెప్పారు.బిసీసీ జూన్ 3 వరకూ లాక్ డౌన్ కొనసాగించాలని చెబుతోందన్నారు. మనకు మరో గత్యంతరం లేదు. బతికుంటే బలుసాకు తినొచ్చు. ప్రాణాలు పోవడానికి వీలులేదని కేసీఆర్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టం వాస్తవమే. ఒక నెలలో రాష్ట్రానికి రూ 2,400 కోట్లు రావాల్సింది. లాక్ డౌన్ కారణంగా కేవలం 6 కోట్లు వచ్చాయన్నారు. అయినా తప్పదు. ఆర్థికంగా నష్టపోతే కోలుకుంటాం కానీ ప్రాణాలు పోతే ఎలా అన్నారు.