బన్నీ బర్త్ డే.. మెగాస్టార్ సస్పెన్స్ ట్విట్ !


ఏప్రిల్ 8 స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులకి బర్త్ డే ట్రీట్ ఇవ్వబోతున్నారు బన్నీ. రాత్రి 8:20కి బన్నీ బర్త్ డే గిఫ్ట్ రాబోతుంది. ఇంతలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఏప్రిల్ 8..  ఈ తారీఖుతో నాకు బోల్డంత అనుబంధం ఉంది … … … (సశేషం)……to be continued” అంటూ ట్విట్ చేశారు చిరు.

ఆ అనుబంధం బన్నీతోనే అన్నది అర్థమవుతోంది. కానీ అదేంటీ ? మెగాస్టార్ ఏం చెప్పబోతున్నారు ?? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బన్నీకి చిరు అంటే ఇష్టం. కాదు ప్రాణం. ఆయనపై ఈగ కూడా వాలడానికి వీల్లేదు అంటారు. మెగాస్టార్ పై బన్నీకి ఉన్న అనుబంధం పలు సందర్భాల్లో బయటపడింది. మరీ.. బన్నీ పుట్టినరోజుతో చిరుకి ఉన్న అనుబంధం ఏంటీ ? అన్నది తెలియాలంటే.. ? మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.