కరోనా ఎఫెక్ట్.. ఆర్ఎస్ఎస్ కీలక నిర్ణయం !

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ యేడాది ‘సంఘ్ శిక్షా వర్గ’ (వేసవి శిక్షణా శిబిరం)ను రద్దు చేసింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య ఓ ప్రకటన చేశారు. ప్రతి యేడాది ఏప్రిల్ నెలలో వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంటుంది ఆర్ఎస్ఎస్. 

వేసవి శిక్షణా శిభిరాన్ని రద్దు చేయడం ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్ఎస్ఎస్ 2017-18లో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరంలో 27,800 మంది పాల్గొనగా, 2018-19లో 29,500 మంది హాజరయ్యారు. ఇక లాక్‍డౌన్ నేపథ్యంలో ఒక యాప్ ద్వారా రోజువారీ శాఖా కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తోంది.