శ్రీలక్ష్మీ కనకాల హఠాత్మరణం
నటుడు రాజీవ్ కనకాల ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన చెల్లెలు శ్రీలక్ష్మీ కనకాల హఠాత్మరణం చెందారు. గత కొంత కాలంగా శ్రీలక్ష్మీ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. సోమవారం హఠాత్తుగా మృతి చెందారు. ఆమె భర్త రామారావు పెద్ది సీనియర్ జర్నలిస్ట్. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు.
రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల ఇటీవలే స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఇంతలో ఆయన చెల్లెల్లు శ్రీలక్ష్మీ కూడా మృతి చెందడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీలక్ష్మీ కనకాల పలు సీరియల్స్ లో నటించారు. ఆమె మరణవార్త తెలియగానే సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.