చిరు సినిమాలో పవన్.. క్లారిటీ వచ్చేసింది !

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ పై తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నారు. పవన్ అడిగితే తన సినిమాని ఇచ్చేస్తానన్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌-పృథ్వీరాజ్‌లు కీలక పాత్రల్లో నటించిన ‘లూసిఫర్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిమేక్ రైట్స్ ని మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు. ఈ రిమేక్ లో ఎవరు నటిస్తున్నారు ? ఎవరు దర్శకత్వం వహిస్తారు ?? అనే విషయంలో క్లారిటీ లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ”లూసిఫర్‌’ చిత్రాన్ని పవన్‌తో తీస్తారని టాక్‌ వినిపిస్తోంది. నిజమేనా’ అని ప్రశ్నించగా, ఆ చిత్రాన్ని తానే చేస్తానని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. తనకోసమే ఆ చిత్ర రీమేక్‌ హక్కులు కొన్నట్లు తెలిపారు. ఒకవేళ పవన్‌కు ఆ సినిమా చేయాలని ఆసక్తి ఉంటే, ఆ కథను తమ్ముడికి ఇస్తానన్నారు. మరి పవన్‌ ఏమంటారో చూడాలి.