హ్యాపీ బర్త్‌డే చిచ్చా

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి సన్నిహితులు, స్నేహితులు, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మాస్‌ లీడర్లలో ఒకరైన మీరు తనకు ఇష్టం. ఆయురారోగ్యాలతో, సంతోషంగా, శాంతియుతంగా మరింత కాలం చిచ్చా ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నా’నని రాసుకొచ్చారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే చిచ్చా.  అంటూ ట్విట్ చేశారు. గత దఫా కేసీఆర్ కేబినేట్ ఎక్సైజ్ శాఖమంత్రిగా విధులు నిర్వహించారు పద్మారావు గౌడ్‌. ఈసారి ఆయనకి డిప్యూటీ స్పీకర్‌ బాధ్యతలు అప్పగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్‌ మంచి స్నేహితులు.