బన్నీ టైటిల్ షాక్ ఇస్తోంది

రెడీ కాండబ్బా స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ వస్తాండది. రేపు (ఏప్రిల్ 8) బన్నీ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులకి కానుక అందజేయనున్నాడు బన్నీ. ఈ మేరకు మైత్రీ మూవీస్ నుంచి ఓ ప్రకటన వచ్చేసింది. రెడీ కాండబ్బా బన్నీ బర్త్ డే గిఫ్ట్ వస్తాండది అని మైత్రీ మూవీస్ ట్విట్టింది. అయితే ఏం గిఫ్ట్ ఇస్తారు ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది.

కేవలం బన్నీ లుక్ టెస్ట్ మాత్రం జరిగింది. బన్నీ లుక్ ని ఫైనల్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలతో ఫస్ట్ లుక్ ని వదులుతారనే ప్రచారం జరిగింది. దాంతో పాటు టైటిల్ ని కూడా ప్రకటిస్తారా ? అంటే అవుననే అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ముందునుంచీ శేషాచలం అనే టైటిల్ వినిపిస్తోంది. ఆ తర్వాత ఆర్య, ఆర్య2 సెంటిమెంట్ తో ఆ అక్షరంతో రెండెక్షరాల టైటిల్ ని చూస్తున్నారనే వార్తలు వినిపించాయి.

లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? బన్నీ-సుక్కు హ్యాట్రిక్ సినిమా టైటిల్ ‘పుష్ప’ అంటున్నారు. అసలు ఇది ఊహించని టైటిల్. మహిళా పేరు ధ్వనించేలా ఆ అక్షరంతో టైటిల్ ఉంటుందనే కామెంట్స్ విపించాయి. అయితే, ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన పుష్ప టైటిల్ వైరైటీ.. షాక్ ఇచ్చేలా ఉంది.