అఖిల్ హ్యాపీ ఫోటో

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నుంచి హ్యాపీ ఫోటో కోసం ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. నేడు అఖిల్ పుట్టినరోజు. అయితే కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన తన బర్త్ డే వేడుకలకి దూరంగా ఉంటున్నట్టు అఖిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బర్త్ డే కానుకగా ఎలాంటి ఫోస్టర్, టీజర్ కానీ రిలీజ్ చేయట్లేదని తెలిపారు.

దానికి బదులుగా ఓ చక్కని ఫ్యామిలీ ఫోటోని షేర్ చేస్తానిని తెలిపాడు. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి దిగిన హ్యాపీ ఫోటో ఒకటి తన కోసం పోస్ట్ చేయమని అఖిల్ కోరాడు. అయితే ఇంతవరకు అఖిల్ నుంచి హ్యాపీ ఫోటో రాలేదు. దీనికోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు అఖిల్ కి స్టార్ హీరో రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. తొలి సినిమా అఖిల్ అట్టర్ ప్లాప్ కావడంతో ఇమేజ్ డ్యామేజ్ అయింది. హలో, మిస్టర్ మజ్ఝ్ను సినిమాలు కూడా నిరాశపరిచాయి. అఖిల్ నాల్గో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అఖిల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు.