చిరు ఆఫర్’నే రిజెక్ట్ చేసిన దర్శకుడు.. ఎంత ధైర్యం ?

ఇప్పుడు టాలీవుడ్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఓ దర్శకుడిని పిలిచి ఆఫర్ ఇచ్చాడట. అయితే అతడు ఆఫర్ ఇచ్చింది మెగాస్టార్ అని కూడా చూడకుండా రిజెక్ట్ చేశాడట. ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరు ఆఫర్ ని రిజెక్ట్ చేయడమేంటీ ? అని మాట్లాడుకుంటున్నారు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి చిరు ఆఫర్ ఇచ్చింది తన సినిమా కోసం కాదు. తన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కోసం. ‘విజేత’ సినిమాతో కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన రెండో సినిమా కూడా సెట్స్ మీదుంది. ఈ నేపథ్యంలో అల్లుడు కెరీర్ పై ఫోకస్ పెట్టిన చిరు.. మారుతిని రంగంలోకి దింపాలని భావించారు. ఆయన్ని పిలిచి కల్యాణ్ దేవ్ తో ఓ సినిమా చేయాలని కోరాడు.

కారణాలు ఏంటీ ? అన్నది తెలియదు. కానీ చిరు ఆఫర్ ని మారుతి సున్నితంగా రిజెక్ట్ చేశారు. దీంతో మారుతీపై చిరు కాస్త అసహంగా ఉన్నట్లు సమాచారం. గతేడాది ‘ప్రతిరోజూ పండగే’తో మంచి విజయాన్ని అందుకున్నాడు మారుతి. మీడియం రేంజ్ హీరోలు ఎవరైనా మారుతి దర్శకత్వంలో నటించేందుకు రెడీగా ఉన్నారు. కానీ మారుతికి మాత్రం స్టార్ హీరోలు కావాలట. అటు వైపుగా ప్రయత్నాలు చేస్తున్నారు.