బన్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సినీ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా సెట్ లో ఎలా ఉంటారు ? ఎంత కష్టపడతారు ? అందరితో ఎలా ఉంటారు ?? ఇవన్నీ అభిమానులకి తెలిసిన విషయాలే. వివిధ సందర్భాల్లో స్వయంగా బన్నీ, ఇతరులు కూడా అభిమానులతో పంచుకున్నారు.
బన్నీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే మాత్రం కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. మనిషిని మనిషిలా చూసే వ్యక్తి బన్నీ. టాలెంట్ ఉన్నోడికి క్రెడిట్ దక్కాల్సిందే అంటారు. అందుకే.. ‘అల.. వైకుంఠపురంలో’ సక్సెస్ క్రెడిట్ ని అందరికీ దక్కేలా ప్లాన్ చేశారు. ఇచ్చారు కూడా. రచయితలకి, దర్శకులని గౌరవిస్తారు. టాలెంట్ ఎవడబ్బా సొంతుకాదు అనే లైన్ ని సపోర్టు చేస్తారు.
ఇంకో విషయం ఏంటంటే.. ? బన్నీ ఫ్యామిలీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లలని ప్రాణంగా చూసుకొంటారు. పిల్లల వీడియో లు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాడు. వారి స్కూల్, వారి డ్రెస్.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా ఉంటాడు. పిల్లలని ఎక్కువగా మొబైల్స్ కి దగ్గరగా ఉండనిచ్చే ప్రయత్నం చేయరు. తన ప్రతీ సినిమాకు వాళ్ళను తీసుకు వెళ్లి చూపిస్తాడు. అల..వైకుంఠపురంలో సినిమాతో బన్నీ ఇద్దరు పిల్లు తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఓ మై డ్యాడీ.. సాంగ్ లో చిందేశారు. అది బన్నీ అభిమానులని మురిపించింది.