రోనా కట్టడి కోసం ట్విట్టర్ భారీ సాయం

కరోనా వైరస్ పై పోరాటానికి సోషల్ నెట్‌వర్క్ ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సే భారీ విరాళాన్ని ప్రకటించారు. బిలియన్ డాలర్ల సహాయం చేయనున్నట్లు తెలిపారు. తన సంపదలోని 28 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు డార్సే పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలని కరోనా వణికిస్తోంది. భారత్ లోనూ కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5వేలు దాటింది. మరణాల సంఖ్య వంద దాటింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 తర్వాత కూడా భారత్ లో లాక్‌డౌన్‌ పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.