ఫ్యామిలీ విబేధాలని బయటపెట్టిన అఖిల్ బర్త్ డే ?
అక్కిని ఫ్యామిలీ గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో విబేధాలున్నాయట. అవి బుధవారం అఖిల్ బర్త్ డే సందర్భంగా బహిర్గతం అయ్యాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుధవారం అఖిల్ పుట్టినరోజు జరుపుకొన్నారు.
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన తన బర్త్ డే సెలబ్రేషన్స్ రద్దు చేసుకుంటున్నట్టు ముందురోజే ప్రకటించారు అఖిల్. కానీ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి హ్యాపీ ఫోటో ఒకటి షేర్ చేస్తాను. మీరు కూడా షేర్ చేయండని అభిమానులని కోరాడు అఖిల్. చెప్పినట్టుగానే అఖిల్ తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటో ఒకటి షేర్ చేశారు.
తల్లిదండ్రులు నాగ్-అమలతో కలిసి అఖిల్ ముద్దుగా దిగిన ఫోటో ఇది. లెటెస్ట్ ఫోటోనే. ఇందులో చైతూ, సామ్ మిస్ అయ్యారు. ఫ్యామిలీ అంటే వారు కూడా రావాలి కదా. వారిని అఖిల్ పక్కనపెట్టేశాడు. ఇదే నా ఫ్యామిలీ అన్నట్టు పోస్ట్ చేశాడు. చైతూ-సామ్ కూడా అఖిల్ ని పక్కనపెట్టేశారు. బర్త్ డే రోజున కనీసం అఖిల్ ని విష్ చేయలేదు. అంటే సోషల్ మీడియా వేదికగా విష్ చేయలేదు.
బహుశా.. నేరుగా కలిసి లేదంటే ఫోన్ చేసి విష్ చేసి ఉండవచ్చు. కానీ ఆ విషయం అభిమానులకి తెలియదు కదా. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనే అనుమానాలని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారానికి అక్కినేని ఫ్యామిలీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పులిస్టాప్ పెడితే మంచిదేమో.. !