కరోనా కాటు : మరో హాలీవుడ్ నటుడు మృతి

కరోనా కాటుకు మరో హాలీవుడ్ నటుడు బలయ్యాడు. హాలీవుడ్‌ నటుడు అలెన్ గార్ఫీల్డ్‌(80) కరోనా చికిత్స పొందుతూ మంగళవారం న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సహచర నటి రోనీ బ్లాక్లే వెల్లడించారు. ‘ ‘నాష్‌విల్లె’ సినిమాలో త‌న‌కు భర్తగా నటించిన వ్యక్తి కరోనా వల్ల మ‌ర‌ణించాడ‌ని తెలిసి బాధ‌నిపించిందని, ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నా’నని రోని త‌న ఫేస్‌బుక్ పోస్టులో పెట్టారు.

నాష్‌విల్లే, ది స్టంట్‌ వంటి చిత్రాలు అలెన్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు.  విలన్‌ ప్రాత్రల్లోనే అధికంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వూడీ అలెన్‌, విమ్‌ వెండర్స్‌ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన చివరిసారి 2016లో విడుదలైన చీఫ్‌ జాబులో కనిపించారు.