ప్రతిరోజూ 2వేల మంది కడుపు నింపుతున్న బిగ్ బీ !

కరోనా కట్టడి కోసం దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో నిరుపేదలు ఆకలి అలమటించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వారిని ఆదుకొనేందు సినీ తారలు, పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. కఠన సమయాన పేదల ఆకలితీర్చే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రతిరోజూ 2వేల మంది ఆకలి తీరుస్తున్నారు. అది కూడా మూడు పూటల. ఈ విషయాన్ని బిగ్ బీ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.

‘ముంబాయ్ లో ఆహారం లేక అల‌మ‌టిస్తున్న‌వారికి రోజుకి రెండుపూట్లా..లంచ్‌, డిన్న‌ర్ ఏర్పాటు చేస్తున్నా. అంతేకాదు.. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడెరేష‌న్ తో అనుబంధ‌మున్న రోజువారీ వేత‌న కార్మికుల కుటుంబాల‌కు నెల‌నెలా రేష‌న్ పంపిణీ చేస్తున్నా’నని బిగ్ బీ తెలిపారు. పేదలకి ఆహారం అందిస్తున్న సమయంలో ఎదురవుతున్న సమస్యలని బిగ్ బీ ప్రస్తావించారు.